బ్లాక్ హెయిర్ కోసం పెళ్ళి హెయిర్‌స్టైల్స్

భారతీయ మహిళలు ప్రపంచంలోకెల్లా అందమైన, న్యాచురల్‌గా కనిపించే డార్క్ హెయిర్ కలిగి ఉంటారని ప్రసిద్ధి. ఒక సాధారణ కేశాలంకరణ కూడా బ్లాక్ హెయిర్‌ను చాలా సొగసైనదిగా చేస్తుంది. కాబట్టి మీరు తలలు తిప్పి చూసేట్టుగా చేయడానికి ఈ వివాహ సీజన్‌లో ఒక సాధారణ కేశాలంకరణ కూడా మీలోని అంతర్గత దివాని బైటకు తీసేదిగా సృష్టించాలి.

గోద్రేజ్ ఎక్స్‌పర్ట్ రిచ్ క్రెమ్ న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్‌తో పరిపూర్ణ మెరిసే బ్లాక్ కలర్‌ను పొందడం ద్వారా ప్రారంభించండి. తరువాత, మీ వివాహ దుస్తులతో సరిపోవడానికి ఈ బ్రహ్మాండమైన కేశాలంకరణలలో ఒకదాన్ని ప్రయత్నించండి.

1. ఫ్రెంచ్ జడ:

మీ రిసెప్షన్ లేదా సంగీత్ లుక్ పూర్తి చెయ్యడానికి సరైన కేశాలంకరణ కోసం వెతుకుతున్నారా? డిఐవై ఫ్రెంచ్ జడను ప్రయత్నించండి. ఇది చూడడానికి సొగసైనది మరియు సృష్టించడానికి సులభం! ఏవైనా నాట్లు లేదా చిక్కులను వదిలించుకోవడానికి మీ హెయిర్‌ను దువ్వండి. ఎడమ, మధ్య మరియు కుడి – 3 సమాన భాగాలుగా మీ హెయిర్‌ను విడతీయండి. ఎడమ భాగాన్ని తీసుకోండి, మధ్యలో ఒకటి దాటి, కుడి భాగంతో అల్లండి. కుడి భాగాన్ని తీసుకోండి, అది మధ్యలో దాటి, ఎడమ భాగంతో కలపండి. మరియు మళ్ళీ, ఎడమ భాగం తీసుకొని మధ్యలో దాటి, కుడి భాగంతో కలపడం.మెడ వరకూ వచ్చేదాకా ఇలా అల్లుతూపోండి,ఆఖరున ఒక రబ్బరుబ్యాండుతో జడని బిగిస్తే ఇక తయారైపోయినట్టే!

Courtesy – cindersandbroomsticks.tumblr.com

2. సైడ్ ట్విస్ట్:

సైడ్ ట్విస్ట్ లో మంచి విషయం ఏమిటంటే ఇది ఎంత పొడవు ఉన్న హెయిర్ మీదైనా చేయవచ్చు! ఇది సులభంగా నేర్చుకోదగిన హెయిర్ నైపుణ్యాల్లో ఒకటి, కాబట్టి దీనితో మీరు రోజులో ఒక సమావేశానికి హాజరు కాగలరు, తర్వాత మీ కేశాలంకరణ గురించి ఆందోళన చెందకుండా ఒక పెళ్లి కోసం అటునుంచే నేరుగా వెళ్ళవచ్చు. మొదట, వత్తుగా కన్పించటానికి తలకట్టుపై హెయిర్‌ని వెనక్కి దువ్వండి. అప్పుడు, మీ తల యొక్క ఎడమ మరియు కుడి వైపు నుండి మీ హెయిర్ యొక్క చిన్న పాయలు తీసుకోండి. వాటిని ట్విస్ట్ చేయండి, వెనుకవైపు దాన్ని మొత్తం అల్లి బాబీ పిన్స్ తో జాగ్రత్తగా ఉంచండి. దీనికి మరింత చిక్ రూపాన్ని ఇవ్వడానికి, మీ ముఖం చుట్టూ కొన్ని వెంట్రుకలను వదులుగా ఉంచండి. ఒక మెహందీ ఫంక్షన్ లో ఈ రూపం మీ దుస్తులతో కలిపి, ఈ సాధారణ కేశాలంకరణ కూడా మీకు అనేక పొగడ్తలు తెచ్చిపెడుతుంది!

Courtesy – beautylish.tumblr.com

 

3. జడతో ముడి:

మీరు ఒక సంగీత్‌లో నృత్యం చేయాలనుకునప్పుడు మరియు ఇంకా ఆకర్షణీయంగానే ఉండాలి అంటే, మీరు మీ ముఖం నుండి మీ హెయిర్‌ను దూరంగా ఉంచే ఒక కేశాలంకరణ కోసం చూస్తున్నట్లయితే, ఈ జడతో వేయబడే ముడి మీ కోసం ఉద్దేశించబడిందే. ఈ కేశాలంకరణ మనోహరమైనది మరియు సొగసైనది మరియు కేవలం 5 నిమిషాల వ్యవధిలో సృష్టించబడుతుంది. మీ తల వెనుక ఒక సాధారణ క్రిందగా వేసే అల్లికజడతో మీ హెయిర్‌ను జడవేయడం ప్రారంభించండి మరియు ఒక రబ్బరు బ్యాండ్‌తో దాని చివర్లు ఊడిపోకుండా ఉంచండి. అప్పుడు మీ తల వెనుక ఒక ముడిలా ట్విస్ట్ చేయండి. అవసరమైన సంఖ్యలో చుట్టులు చేయడం ద్వారా మీరు ముడి పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. చివరగా, దీనిని బాబీ పిన్స్‌తో కలిపి ఉంచండి మరియు ఇంకేముంది అందరికీ కన్పడేలా విలాసంగా తిరగండి.

Courtesy – weddbook.com

ఇప్పుడు మేము ఈ బ్లాక్ హెయిర్ కోసం ఈ కేశాలంకరణలను సరళమైన దశల్లోకి తీసుకువచ్చి సమప్ చేసాము కాబట్టి, మీరు ప్రతి వివాహ సందర్భంలో మీ ఉత్తమమైన లుక్‌తో కనిపించవచ్చు. ఒక్కసారి మీరు సరైన కేశాలంకరణ మరియు కలర్‌ను ఎంచుకున్న తర్వాత, మీ హెయిర్‌ను కొన్ని అద్భుత ఉపకరణాలతో ఫ్లాంట్ చేయండి.

Feature Image Courtesy – linandjirsablog.com

Latest Stories

Articles

జుట్టు చిన్నగా ఉన్నవారు సులభంగా వేసుకోగల అయిదు హెయిర్ స్టైల్స్

సాధారణంగా భారతీయ మహిళల అందం అంతా వారి కురులలోనే దాగి ఉంటుంది. అందులోనూ ప్రత్యేకించి, పొడవు జుట్టు మహిళలకు ఎంతో అందాన్ని ఇస్తుంది. కానీ మారుతున్న కాలాన్ని బట్టి, మహిళలు కూడా తమ అభిరుచులను మార్చుకుంటూ, క్రొత్తదనాన్ని ఆహ్వానించడం మొదలు పెట్టారు.…

Articles

బర్గండీ హెయిర్ కలర్ తో మీ కురులకు చక్కటి మెరుగులు అద్దండి

మన భారతీయ వివాహ వ్యవస్థలో పెళ్ళికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంధుమిత్రులు అందరూ చక్కగా ఒక చోట చేరి, పెళ్ళిని నాలుగయిదు రోజులు వేడుకగా జరుపుకోవడం మన ఆనవాయితీ. అయిదు రోజుల పెళ్ళిళ్ళు అని మనం వింటూ ఉంటాము కూడా !!…